Indian Men’s Hockey team : హాకీ లెజెండ్ (Hockey Legend) మేజర్ ధ్యాన్‌చంద్ (Major Dhyanchand) కు భారత పురుషుల హాకీ జట్టు (Indian Men’s Hockey team) నివాళులు అర్పించింది. దేశ రాజధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం (Major Dhyanchand National stadium) లో ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసిన పురుషుల హాకీ టీమ్ సభ్యులు అంజలి ఘటించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం పతకం గెలిచిన భారత హాకీ టీమ్ శుక్రవారం స్వదేశానికి చేరుకుంది. ఇవాళ జట్టు సభ్యులందరూ ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియానికి వచ్చిన ఆయనకు నివాళులు అర్పించారు. భారత హాకీ టీమ్ సభ్యులు హాకీ లెజెండ్‌కు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Indian Men’s Hockey Team players pay tribute to Hockey legend Major Dhyan Chand at the Major Dhyanchand National Stadium, New Delhi
Indian Hockey Team won a bronze medal at the #ParisOlympics2024 pic.twitter.com/tWkeARgHBg
— ANI (@ANI) August 10, 2024