న్యూఢిల్లీ, జనవరి 5: ఇరాన్లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో టెహ్రాన్‌కు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని దేశ పౌరులకు భారత ప్రభుత్వం సూచించింది. తదుపరి ఆదేశాల వరకు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలను నివారించుకోవాలని సూచించింది.
ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులు, భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండి నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, టెహ్రాన్‌లోని భారత ఎంబసీకి చెందిన వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిళ్లను నిశితంగా గమనిస్తూ ఉండాలని కేంద్రం పిలుపునిచ్చింది. రెసిడెంట్ వీసాలపై ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు భారత ఎంబసీలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది.