జోధ్‌పూర్: యుద్ధ భూమిలో 10-12 మంది చిన్నపాటి సైనికులు బృందం అవసరాలకు సరిపోయేలా ఉప్పు నీటిని శుద్ధి చేసి మంచి నీళ్లుగా మార్చే చిన్నపాటి పరికరాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) రూపొందించింది. దీన్ని చేత్తో లేదా ఇంజిన్‌తో నిర్వహించవచ్చు. జోధ్‌పూర్‌లోని రక్షణ ప్రయోగశాల దీన్ని అభివృద్ధి చేసింది. ‘స్వదేశ్’ గా పిలిచే ఈ పరికరాన్ని తాజా నీటి వనరులు అవసరమైన సామాన్య ప్రజలు కూడా ఉపయోగించవచ్చు.