ఇరాన్ నుంచి పరారీకి ఖమేనీ సన్నాహాలు?
దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీచేసిన తర్వాత ఇరాన్లో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
- నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు
న్యూఢిల్లీ, జనవరి 5: దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీచేసిన తర్వాత ఇరాన్లో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ దేశం విడిచి పారిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఓ మీడియా సంచలన కథనాన్ని వెల్లడించింది. దేశంలో అలజడి పెరిగిపోతే 20 మంది సన్నిహిత సహచరులు, కుటుంబ సభ్యులతో టెహ్రాన్ నుంచి పారిపోవడానికి ఖమేనీ సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ ది టైమ్స్ పత్రిక కథనాన్ని రాసింది.
1979నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత ఎనిమిదేండ్లకు ఇరాన్ నుంచి పారిపోయిన మాజీ ఇజ్రాయెలీ నిఘా అధికారి బెనే సబ్తీని ఉటంకిస్తూ ఖమేనీ మాస్కోకు పారిపోవచ్చని, ఆయనకు ప్రపంచంలో తలదాచుకోవడానికి మరో దేశం ఏదీ లేదని టైమ్స్ తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని ఆరాధించే ఖమేనీ రష్యా తమకు సాంస్కృతికంగా చాలా సన్నిహిత దేశమని ఇరాన్ సుప్రీం నాయకుడు భావిస్తారని సబ్తీ వెల్లడించినట్లు పత్రిక తెలిపింది.
కొనసాగుతున్న నిరసనలు
టెహ్రాన్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆదివారం వరుసగా 8వ రోజు కూడా ఖమేనీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. టెహ్రాన్‌లోని ప్రధాన బజారుతోపాటు ప్రధాన షాపింగ్ సెంటర్ల వద్ద భారీ స్థాయిలో భద్రతా దళాలను మోహరించారు. నగరంలో అనేక దుకాణాలు మూతపడ్డాయి. సాధారణ దుస్తులు ధరించిన భద్రతా ఏజెంట్లు ప్రధాన వీధుల్లో నిఘా వేసి తిరుగుతున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ తెలిపింది. టెహ్రాన్‌లోని జోంహోరీ వీధిలో నిరసనలు తెలియచేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
టెహ్రాన్‌కు పొరుగున ఉన్న నార్మక్, నజియాబాద్, హఫీజ్ స్ట్రీట్‌తోపాటు సెమ్నన్ ప్రావిన్సులోని సంగ్సర్, ఫార్స్ సర్‌లోని నూరాబాద్-ఇ మామసని వంటి అనేక నగరాలకు నిరసనలు విస్తరించాయి. దేశంలో దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందుతూ ప్రజలు డిసెంబర్ 28న ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించడంతో దేశంలో అలజడి మొదలైంది. నిరసనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపి హతమారిస్తే అమెరికా నుంచి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా ఖమేనీ పరారీపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

