అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైబర్ మోసాల (Cyber Fraud) పై అవగాహన, ఫిర్యాదుల కోసం యాప్(AAP) ను ప్రారంభించింది. శనివారం విజయవాడలో నిర్వహించిన వాకథాన్‌లో హోంమంత్రి వంగలపూడి అనిత ( Vangalapudi Anita) యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనేక లోన్ యాప్‌లు, సామాజిక మాధ్యమాలు, హనీట్రాప్ వలలో పడి పలువురు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నేరాల నియంత్రణకు రాష్ట్రస్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన, ఫిర్యాదుల కోసం రూపొందించామన్నారు. దేశంలో 24 శాతం వరకు సైబర్ నేరాలు పెరగడం ఆందోళన కలిగించే అంశమని వివరించారు. నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా రూ. 1730 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని వెల్లడించారు.
పూర్తి వీడియో పంపిస్తా చూడు.. నేను కేసులకు భయపడను.. వైఎస్ జగన్‌కు శ్రీశైలం ఎమ్మెల్యే సవాలు
Pawan Kalyan | ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అమన్‌కు పవన్ కల్యాణ్ అభినందనలు