Paris Olympics 2024 : ఒలింపిక్స్ బరిలో ఉన్న ఆఖరి రెజ్లర్ రితికా హుడా (Reetika Hooda)కు చుక్కెదురైంది. మహిళల 76 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఆమె పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన బౌట్లో కిర్గిస్థాన్‌కు చెందిన టాప్ సీడ్ ఐపెరి మెడెట్ కిజీ(Aiperi Medet Kyzy) చేతిలో రితికా ఓటమి పాలైంది.
తొలి రౌండ్లో 1-0తో ఆధిక్యం కనబరిచిన ఆమె ఆ తర్వాత కూడా జోరు చూపింది. ఐపెరి సైతం ఓ పాయింట్ సాధించగా 1-1తో స్కోర్ సమం అయింది. అయితే.. అనూహ్యంగా జడ్జిలు ఐపెరిని విజేతగా ప్రకటించారు. ఆరు నిమిషాల పాటు జరిగిన బౌట్లో చివరి టెక్నికల్ పాయింట్ సాధించిన ఆమెను సెమీస్‌కు వెళ్లింది. దాంతో, రితిక 3-1తో ఓడి సెమీస్ చాన్స్ చేజార్చుకుంది.
HEART-BREAK REETIKA HOODA 💔
Reetika lost the Quarter Finals…!!!– She fought so so hard, just 21 years old, got a bright future in Wrestling.#ReetikaHooda #Paris2024 #GOLD #Olympic2024 #Hindenburg #stockmarketcrash pic.twitter.com/mZbFut5aqC
— Sajit Khan 🇮🇳 (@SajitKhan0027) August 10, 2024
ఒకవేళ ఐపెరి ఫైనల్‌కు దూసుకెళ్తే రితికకు రెపెచేజ్ రౌండ్లో ఆడే అవకాశం ఉంటుంది. ఆ పోరులో భారత రెజ్లర్ అదరగొడితే భారత్‌కు మరో కాంస్యం దక్కినట్టే. అంతకముందు జరిగిన 16వ రౌండ్లో రితిక తన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసింది. హంగేరికి చెందిన నగీపై 12-2తో గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.