Sarabjot Singh : ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన షూటర్ సరబ్జోత్ సింగ్ (Sarabjot Singh) భవిష్యత్తును మరింత పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇకపైన కూడా షూటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కోసం ఈ యంగ్ష్టర్ భారీ ఆఫర్‌ను సైతం వదలుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సరబ్జోత్ తిరస్కరించాడు.
అబ్బే.. మీరిచ్చే ఉద్యోగం నాకొద్దు. ఇప్పట్లో షూటింగ్‌ను వదిలే ముచ్చటే లేదని స్పష్టంగా చెప్పేశాడు. దాంతో, పంజాబ్ సర్కార్ కంగుతిన్నది. పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడల్లో సరబ్జోత్ సింగ్ పతక గర్జన చేశాడు. వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన అతడు.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను భాకర్ (Manu Bhaker)తో కలిసి కంచు మోత మోగించాడు. దాంతో, ఒలింపిక్స్‌లో మెడల్ గెలవాలనే కలను నిజం చేసుకున్నాడు.
VIDEO | “I am happy that they offered me a job but right now I am focused on shooting and I am not looking for a job. I will think about it later,” says Olympian Sarabjot Singh on Punjab government issuing a notice to make him Deputy Director of the Sports Department in the… pic.twitter.com/dE5Hycn0oV
— Press Trust of India (@PTI_News) August 10, 2024
దేశ ప్రతిష్ఠతో పాటు రాష్ట్ర పరపతిని పెంచిన ఈ ఒలింపిక్ విజేతకు పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామంటూ ప్రకటించింది. రాష్ట్ర స్పోర్ట్స్ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించేందుకు సర్వం సిద్దం చేసింది. మరెవరైనా అయితే ఎగిరి గంతేసేవారు.
సరభ్‌జోత్, మను భాకర్
కానీ, సరభ్‌జోత్ మాత్రం ఆ జాబ్‌ను సున్నితంగా తిరస్కరించాడు. ‘వాళ్లు ఉద్యోగం ఇస్తామన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే.. ఇప్పుడు నా దృష్టంతా షూటింగ్ మీదే ఉంది. జాబ్ గురించి తర్వాత ఆలోచిస్తాను’ అని సరబ్జోత్ సింగ్ బదులిచ్చాడు.