Harbhajan Singh | నీరజ్-నదీమ్ మంచి సందేశాన్ని ఇచ్చారు.. గోల్డ్ మెడల్‌తో వినేశ్‌ను చూడకపోవడం నిరాశపరిచింది : హర్భజన్
Harbhajan Singh | పారిస్ ఒలింపిక్స్‌లో భారత్, పాక్‌కు చెందిన జావెలిన్ త్రోయర్లు నీరజ్ చోప్రా, నదీమ్ పతకాలు సాధించారు. ఇద్దరు పతకాలు సాధించిన అనంతరం ఒకరినొకరు మాట్లాడుకోవడం కనిపిచింది. దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
Harbhajan Singh | పారిస్ ఒలింపిక్స్‌లో భారత్, పాక్‌కు చెందిన జావెలిన్ త్రోయర్లు నీరజ్ చోప్రా, నదీమ్ పతకాలు సాధించారు. ఇద్దరు పతకాలు సాధించిన అనంతరం ఒకరినొకరు మాట్లాడుకోవడం కనిపిచింది. దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య సోదరభావం సరిహద్దులు దాటి క్రీడలు ప్రజలను ఏకం చేస్తాయని నమ్ముతున్నానని పేర్కొన్నాడు. ఒలింపిక్స్‌లో గురువారం పాక్‌కు చెందిన నదీమ్ 92.97 మీటర్లు జావెలిన్‌ను విసిరి రికార్డు సృష్టించాడు. దాంతో బంగారు పతకాన్ని సాధించాడు. ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా సీజన్లో అత్యుత్తమంగా 89.45 మీటర్లు విసిరి రజతం గెలిచాడు.
స్వతంత్ర భారతం నుంచి రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ నిలిచాడు. ‘పోటీలు ముగిసిన అనంతరం నీరజ్, నదీమ్ ఒకరి నొకరు మాట్లాడుకోవడం చూశాం. ఇద్దరు తమ తమ దేశ జెండాలను పట్టుకున్నారు. ఇద్దరు ఒకరినొకరు ఆటగాళ్లుగా గౌరవించుకున్నారు. క్రీడలు అన్ని హద్దులకు అతీతంగా ఉంటాయి. వీరిద్దరూ చాలామంచి సందేశాన్ని ఇచ్చారు. ఇది తాము క్రికెట్లో పాకిస్తాన్‌తో మైదానంలో పోటీ పడ్డాం. ఆటగాళ్ల మధ్య మంచి సంబంధం ఉంది’ అని మాజీ ఆఫ్ స్పిన్నర్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నీరజ్ తల్లి చేసిన ప్రకటనను సైతం హర్భజన్ స్పందించాడు. నీరజ్ తల్లి సరోజ్ దేవి బంగారు పతకం సాధించిన నదీమ్ సైతం తనకు కొడుకులాంటివాడేనని పేర్కొన్నారు. దీనిపై పలువురు సానుకూలంగా స్పందించగా.. మరికొందరు వ్యతిరేకించారు.
హర్భజన్ మాత్రం ప్రకటనను స్వాగతించాడు. ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించిన నదీమ్‌కు అభినందనలు తెలిపాడు. నీరజ్ తమ హీరోనని తెలిపాడు. ఇక వినేశ్‌పై అనర్హత వేటువేయడంపై హర్భజన్ నిరాశ వ్యక్తం చేశాడు. వంద గ్రాముల బరువు కారణంగా ఫైనల్‌కు దూరం కావడం చాలా నిరాశకు గురి చేసిందని.. బాధగా ఉందని పేర్కొన్నాడు. వంద గ్రాములు పెద్ద బరువేం కాదని.. ఒలింపిక్స్‌లో నియమాలు అందరికీ ఒకేలా ఉంటాయని తెలిపాడు. ఈ కష్ట సమయంలో వినేశ్‌కు అండగా ఉంటామని.. దాన్ని నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నామన్నారు. గోల్డ్ మెడల్‌తో ఆమెను చూడకపోవడం నిరాశపరిచిందని.. కానీ, వినేశే మనకు బంగారం పతకం.. దేశానికి గర్వకారణమని టర్బోనేటర్ చెప్పుకొచ్చాడు.
Read Also :
Suryakumar Yadav | మూడు ఫార్మాట్లకు ఆడుతా.. తొలి అడుగు వేస్తున్నా
Litton Das | బంగ్లాదేశ్ ప్రజలారా.. మా ఇంటిని ఎవరూ తగలబెట్టలే.. మేమంతా భద్రంగానే ఉన్నాం!
Jitesh Sharma | భారత టీ20 స్పెషలిస్ట్ పెండ్లి.. వధువు ఎవరంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

