Jitesh Sharma : భారత యువ క్రికెటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma) పెండ్లి చేసుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన జితేశ్ శుక్రవారం దాంపత్య జీవితం ఆరంభించాడు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన షలక షలక ముకేశ్వర్ (Shalaka Mukeshwar)ను జితేశ్ మనువాడాడు. ఈ యువ జంట పరిణయం కుటుంభసభ్యుల సమక్షంలో ఆద్యంతం సంప్రదాయంగా, వైభవంగా జరిగింది.
తమ పెండ్లి వేడుక ఫొటోలను జితేశ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ క్రేజీ ప్రపంచంలో 8.8.8న మనం ఒకరికొకరం దొరికాం’ అంటూ ఆ ఫొటోలకు జితేశ్ క్యాప్షన్ రాశాడు. ఇంకేముంది క్షణాల్లో ఈ నూతన వధూవరుల ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండ్ శివం దూబేలతో పాటు పలువురు ఐపీఎల్ ఆటగాళ్లు జితేశ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఐపీఎల్లోతో వెలుగులోకి వచ్చిన యువ ఆటగాళ్లలో జితేశ్ ఒకడు. వికెట్ కీపర్, పవర్ హిట్టర్‌గా పేరొందిన ఈ యువకెరటం పంజాబ్ కింగ్స్( Punjab Kings) తరఫున అద్భుతంగా ఆడాడు. దాంతో, అందరూ ఊహించినట్టుగానే టీమిండియాకు ఎంపికయ్యాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత బ్యాకప్ వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికా పర్యటనక వెళ్లాడు.
తాజాగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ జితేశ్ రాణించాడు. ఇప్పటివరకూ ఈ యంగ్‌స్టర్ బ్లూ జెర్సీతో 9 టీ20లు ఆడాడంతే. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. షలక ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివింది. అనంతరం ఎంటెక్ పూర్తి చేసిన ఆమె మహారాష్ట్రలో సీనియర్ టెస్ట్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తోంది.