Mufasa The Lion King | లైవ్ యాక్షన్, యానిమేషన్ మూవీలంటే పిల్లలతో పాటు పెద్దలకు ముందుగా గుర్తోచ్చేది ‘ది లయన్ కింగ్’. 1994లో వచ్చిన’ ది లయన్ కింగ్’ యానిమేటెడ్ క్లాసిక్ నవల్ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) అంటూ ఈ సినిమా రానుంది. ఇప్పటికే టీజర్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను వదిలారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొదటి రెండు (The Lion King) పార్ట్‌లలో అడవికి రాజుగా ఉన్న ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉండడం అతడికి సింబా అనే కుమారుడు జన్మించడం చూడవచ్చు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ముఫాసా అడవికి రాజుగా అసలు ఎలా ఎదిగాడు అతడికి సోదరుడు ఉన్న టాకా ఎలా చనిపోయాడు అనే విషయాలు చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్ అడ్వెంచర్‌గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దర్శకుడు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..