Susan Wojcicki: గూగుల్ యాడ్సెన్స్ లో ఈమెదే కీలక పాత్ర.. సుసాన్ వోజికి అచీవ్మెంట్స్ ఇవే..
Susan Wojcicki : గూగుల్ ఫౌండర్స్ అవార్డును సుసాన్ గెలుచుకున్నారు. యాడ్‌సెన్స్‌ను ఆమె డెవలప్ చేశారు. గూగుల్ ఇమేజ్ సెర్చ్ క్రియేట్ చేశారామె. గూగల్స్ ఫస్ట్ వీడియో అండ్ బుక్ సెర్చ్‌ను కూడా డెవలప్ చేశారు. యాడ్‌సెన్స్‌ను ఆరంభంలో క్రియేట్ చేసిందామే. యాడ్స్‌కు ఎస్వీపీగా చేశారు.
న్యూఢిల్లీ: యూట్యూబ్ మాజీ సీఈవో , గూగుల్ యాడ్సెన్స్ సృష్టికర్త సుసాన్ వోజికి(Susan Wojcicki) మృతిచెందినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. యూట్యూబ్ రూపకల్పనలో వోజికి కీలక పాత్ర పోషించారు. ఆమె రెండేళ్ల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆమె మరణం తీవ్ర బాధను మిగిల్చిందని , గూగుల్ చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉందని, ఆమెలేని ప్రపంచాన్ని ఊహించలేకపోతున్నట్లు పిచాయ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో వెల్లడించారు.
సుసాన్ అసాధారణ వ్యక్తి అని, గొప్ప నాయకురాలు అని, స్నేహితురాలు అని పిచాయ్ పేర్కొన్నారు. ఆమె తనకు ఎంతో సన్నిహితురాలు అని, ఆమెను మేం కోల్పోతున్నామని, ఆమె ఫ్యామిలీకి సంతాపం తెలుపుతున్నట్లు గూగుల్ సీఈవో వెల్లడించారు. గూగుల్ స్థాపన నుంచి ఆమె ఆ సంస్థలో పనిచేశారు. గూగుల్ ఫౌండర్స్ అవార్డును ఆమె గెలుచుకున్నారు. యాడ్‌సెన్స్‌ను ఆమె డెవలప్ చేశారు.
గూగుల్ అడ్వర్టైయిజింగ్లో యాడ్సెన్స్ ఎంతో పాత్ర పోషిస్తున్నది. గూగుల్ సంస్థలో ఆమె 25 ఏళ్లు పనిచేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమె గూగుల్ నుంచి తప్పుకున్నది. ఆమె స్థానంలో కొత్త సీఈవోగా నీల్ మోహన్‌ను నియమించారు. యూట్యూబ్‌లో వోజికి.. మార్కెట్‌ను మేనేజ్ చేశారు. గూగుల్ ఇమేజ్ సెర్చ్ క్రియేట్ చేశారామె. గూగల్స్ ఫస్ట్ వీడియో అండ్ బుక్ సెర్చ్‌ను కూడా డెవలప్ చేశారు. యాడ్‌సెన్స్‌ను ఆరంభంలో క్రియేట్ చేసిందామే. యాడ్స్‌కు ఎస్వీపీగా చేశారు.
Unbelievably saddened by the loss of my dear friend @SusanWojcicki after two years of living with cancer. She is as core to the history of Google as anyone, and it’s hard to imagine the world without her. She was an incredible person, leader and friend who had a tremendous…
— Sundar Pichai (@sundarpichai) August 10, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

