Litton Das : బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన హింసలో భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగడం చూశాం. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ముష్రఫె ముర్తాజా (Mushrafe Mortaza)తో పాటు పలువురు క్రికెటర్ల ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దాంతో, పలువురు ఆటగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిన వార్తలు చదివాం. మాజీ సారథి లిట్టన్ దాస్ (Litton Das) ఇంటిని కూడా దుండగులు తగులబెట్టారనే కథనాలు మీడియలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో లిట్టన్ ఎక్స్, ఫేస్బుక్ వేదికగా స్పందించాడు.
బంగ్లా అల్లర్లలో తన కుటుంబానికి, తన ఇంటికి ఏమీ కాలేదని.. అందరం సురక్షితంగానే ఉన్నామంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ‘ప్రియమైన బంగ్లా ప్రజలారా.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మా ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే.. అదంతా అబద్దం.
Some Indian media spread the rumours that “some Islamist set fire on Cricketer Litton Kumar Das’s house”.
How ridiculous I just can’t imagine how this Indian media spread hate. Just go to Litton’s Facebook and see what he reply about your rubbish rumours. pic.twitter.com/Z9PWFQGCAn— Menhajul Abedin (@menhajul38903) August 9, 2024
ఇలాంటి తప్పుడు వార్తలనే ఎవరూ నమ్మకండి. ఇప్పటకైతే నేను, నా కుటుంబం సురక్షితంగానే ఉన్నాం’ అని లిట్టన్ దాస్ వెల్లడించాడు. అంతేకాదు తమది మత ఛాదంసదేశం కాదని, మతాలతో, కులాలతో సంబంధం లేకుండా అందరం ముందుకు సాగుతామని తాను విశ్వసిస్తున్నట్టు ఈ ఓపెనర్ తెలిపాడు. అల్లర్ల సమయంలో తమ గ్రామమైన దినాజ్‌పూర్ ప్రజలు ఒకరినొకరు కాపాడుకున్న తీరు ప్రశంసనీయం అని లిట్టన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
Rumours were spreading so fast in the Indian media about the attack on the Bangladeshi cricketer, Litton Das’ house. But Litton clarified himself that they are safe till now. pic.twitter.com/cX6inV8sqE
— Cricketangon (@cricketangon) August 9, 2024