Lamborghini Urus SE | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ (Lamborghini) తన హైబ్రీడ్ వర్షన్ కారు ఉరుస్ ఎస్ఈ (Urus SE) ఎస్యూవీ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.4.57 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఇప్పటికే భారత్లో విక్రయిస్తున్న ఉరుస్ ఎస్ (Urus S), ఉరుస్ (Urus) మోడల్ కార్లతో ఉరుస్ ఎస్ఈ (Urus SE) జత కలుస్తుంది. ఇంతకుముందే గ్లోబల్ మార్కెట్లో లంబోర్ఘినీ తన రెండో హైబ్రీడ్ మోడల్ కారు ఉరుస్ ఎస్ఈని ఆవిష్కరించింది. హైబ్రీడ్ పవర్ ట్రైన్ (Hybrid Power Train)తోపాటు ఉరుస్ ఎస్ఈ (Urus SE) కారులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచర్ల గురించి తెలుసుకుందామా..!
ఎల్ఈడీ హెడ్ లైట్స్ తోపాటు రీవాంప్డ్ బంపర్, గ్రిల్లె, బోల్డర్ లుక్, ఫ్లోటింగ్ డిజైన్, న్యూలీ డిజైన్డ్ స్పాయిలర్, డిఫ్యూజర్, వై-షేప్డ్ టెయిల్ ల్యాంప్స్, న్యూ 23-అంగుళాల అల్లాయ్ వీల్స్ విత్ పైరెల్లి పీ జీరో టైర్స్ తో ఉరుస్ ఎస్ కారు వస్తోంది. ఆరానిసియో విత్ అరాన్సియో అపోడిస్ ఇంటీరియర్, బియాంకో సఫైరస్ విత్ టెర్రా కెడ్రోస్ ఇంటీరియర్ ఫీచర్లు ఉంటాయి. లంబోర్ఘినీ ఉరుస్ ఎస్ఈ రీడిజైన్డ్ ఫ్రంట్ డాష్ బోర్డ్, లార్జర్ 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ విత్ ఇంట్యూటివ్ కంట్రోల్స్ అండ్ గ్రాఫిక్స్, ఎయిర్ వెంట్స్, అనోడిజైడ్ అల్యూమినియం అసెంట్స్, 12.3 అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే ఉన్నాయి.
ఉరుస్ ఎస్ఈ ఎస్యూవీ కారు హైబ్రీడ్ సిస్టమ్ తో వస్తోంది. ట్విన్ టర్బో 4.0 లీటర్ల వీ8 ఇంజిన్ విత్ ఎలక్ట్రిక్ మోటార్ తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 800 హెచ్పీ విద్యుత్, 950 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 25.9 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో వస్తోంది. కేవలం 3.4 సెకన్లలో 100 కి.మీ వేగం అందుకోనున్న లంబోర్ఘినీ ఉరుస్ ఎస్ఈ.. గరిష్టంగా గంటకు 312కి.మీ దూరం ప్రయాణించగలుగుతుంది. ప్రస్తుతం మార్కె్ట్లో ఉన్న నాలుగు మోడ్స్- స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా వంటి వర్షన్లు ఇందులోనూ ఉంటాయి. ఆఫ్ రోడ్ మోడ్స్ లో నెవె, సబ్బియా, టెర్రా, ఈవీ ఉరుస్ ఎస్ఈ కారు వర్షన్ కారు వస్తోంది.