తిరువనంతపురం, జనవరి 9: కేరళ లోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో బంగారం తాపడాల చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం తెల్లవారుజామున శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవరును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు.
పలువురు సాక్షులతో పాటు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మాజీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్ కూడా ఉన్నికృష్ణన్‌తో రాజీవరుకు ఉన్న సంబంధాన్ని నిర్ధారించారు. తంత్రి ఆయనకు ఆలయ ప్రవేశాన్ని, అనధికార బంగారు పూత పనులకు మార్గం సులభం చేశారని తెలిపారు. పలువురు ఆలయ ఉద్యోగులు కూడా తంత్రి ప్రమేయాన్ని వెల్లడించారు.