హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఫోర్రైజ్ ప్రీమియర్ లీగ్(ఎఫ్‌పీఎల్) శుక్రవారం హైదరాబాద్‌లో అట్టహాసంగా మొదలైంది. ‘ప్లే ఫర్ ఏ కాజ్’ అనే భావనతో ఎఫ్పీఎల్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో 96 జట్లు, 1400మందికి పైగా ప్లేయర్లు పోటీపడుతున్నట్లు తెలిపారు.
వినికిడి లోపం ఉన్న పిల్లలు, మహిళా సాధికారత, స్వీయ రక్షణ, గ్రామీణ క్రీడల అభివృద్ధికి ఎఫ్‌పీఎల్ కట్టుబడి ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ లీగ్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.