కోల్‌కతా : టాటా స్టీల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ ర్యాపిడ్‌గా విజేతగా నిలిచాడు. శుక్రవారం చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా సరిన్ 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
ఆరు పాయింట్లతో ఆనంద్ రెండో స్థానంలో నిలువగా, ఇటీవల వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో రెండు కాంస్యాలు గెలిచిన ఇరిగేసి అర్జున్ ఐదు పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు. తనను చెస్‌కు పరిచయం చేసిన తాత మృతికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు 21 ఏండ్ల సరిన్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. కత్రెయా లాగ్నో(6.5) టైటిల్ దక్కించుకుంది.