CJI DY Chandrachud | కోర్టుల్లో న్యాయమూర్తులు, న్యాయవాదుల పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయమూర్తికి.. న్యాయవాదికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. న్యాయమూర్తి ఎప్పుడూ తన ‘పాదముద్రలను’ ఇసుకపై వదిలివేస్తాడు. ఈ పాదముద్రలు న్యాయమూర్తితో రూపొందించబడ్డ రాతపూర్వక పదాలు. న్యాయవాది వాదనలు ఎంత ఎంత ఆకట్టుకునేలా ఉన్నా.. ఆ వాదనలు భవిష్యత్తు తరాలకు దూరమవుతాయి’ అంటూ జస్టిస్ ఏపీ సేన్ చేసిన వ్యాఖ్యలను సీజేఐ గుర్తు చేశారు. దేశంలోని కోర్టుల్లో సాంకేతిక, ల్యాండ్‌స్కేప్‌పై జరిగిన జాతీయ కాన్ఫరెన్స్‌లో సీఐజే పాల్గొని మాట్లాడారు.
‘1998లో బాంబే హైకోర్టులో న్యాయమూర్తి పదవికి నన్ను ఆహ్వానించారు. దాన్ని అంగీకరించాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయించుకోలేకపోయాను. ఈ విషయంలో చాలామంది విద్యావంతులను సంప్రదించాను. నేను సంప్రదించిన వారిలో జస్టిస్ ఏపీ సేన్ ఒకరు. ఏపీ సేన్ ఏడీఎం జబల్పూర్ కేసులో తీర్పు ఇచ్చారు. నాగ్‌పూర్‌లోని తన నివాసానికి నన్ను ఆహ్వానించారు. ఆ సమయంలో న్యాయమూర్తి పనితనానికి, న్యాయవాదికి మధ్య వ్యత్యాసం ఉంటుంది అని ఆయన నాతో అన్నారు’ అని సీజీఐ గుర్తు చేసుకున్నారు. సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల సీజేఐ మహారాష్ట్రకు చెందిన ఓ కేసులో న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శివసేన, ఎన్సీపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ దాఖలైన కేసులను త్వరగా విచారించాలంటూ న్యాయవాది పదేపదే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని విచారణ ఆలస్యమవుతుందని.. ముందుగాలే విచారించాలని.. విచారణ తేదీలను ప్రకటించాలని కోరగా.. సీజేఐ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు ఆదేశాలు జారీ చేయొద్దని.. న్యాయవాదులు తమ స్థానంలో కూర్చుంటే తమ ఒత్తిడి తెలుస్తుందంటూ ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు.. 128 రోడ్లు మూసివేత
CERT-In | గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా..? కీలక హెచ్చరికలు చేసిన కేంద్ర ప్రభుత్వం..!
Anantnag | అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులకు గాయాలు