రంగారెడ్డి : జిల్లాలోని నందిగామ( Nandigama) మండలానికి చెందిన ఇద్దరు మండల పరిషత్ అధికారులు, ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ ( ACB Trap ) కి పట్టుబడ్డారు. మండలానికి చెందిన బాధితుడు ఒకరు నాలుగు ఇండ్ల నిర్మాణం కోసం ఏదులపల్లి పంచాయతీ కార్యదర్శి అవుల చిన్నయ్యను సంప్రదించాడు.
కార్యదర్శి ఎంపీవో వైద్యవత్ తేజ్ సింగ్( MPO Tej singh ) , ఎంపీడీవో పొన్న సుమతి ( MPDO Ponna Sumati ) తో చర్చలు జరిపి రెండున్నర లక్షలు బాధితుడి నుంచి డిమాండ్ చేశారు. ముందుగా లక్షన్నర ఇవ్వాలని డిమాండ్ చేసిన మేరకు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బుధవారం ముగ్గురు లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా క్కడే మాటువేసిన అధికారులు ముగ్గురిని రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు, అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.