IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో కీలక మ్యాచ్లోనూ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. తమ సొంత మైదానమైన చెపాక్లో దంచలేక చేతులెత్తేశారు. టర్నింగ్ పిచ్ మీద కోల్కతా నైట్ రైడర్స్(KKR) స్పిన్ అస్త్రం సునీల్ నరైన్(3-13) విజృంభణతో సీఎస్కే ఆటగాళ్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. విజయ్ శంకర్(29), రాహుల్ త్రిపాఠి(16).. సిక్సర్ల శివం దూబే(31 నాటౌట్) తనదైన శైలిలో సైతం బౌండరీలు కొట్టలేకపోయాడు. డెత్ ఓవర్లలో మూడు బౌండరీలతో 100 దాటించి.. జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ఈ ఎడిషన్లో ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం.
పద్దెనిమిదో సీజన్లో వరుసగా నాలుగు పరాజయాలు. అది చాలదన్నట్టు కెప్టెన్ అనూహ్యంగా గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మళ్లీ సారథిగా ఎంఎస్ ధోనీ(MS Dhoni) పగ్గాలు అందుకున్నా సరే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ మాత్రం మెరుగవ్వలేదు. ఛేదనలో విఫలమయ్యే సీఎస్కే స్టార్లు. ఈసారి మొదట బ్యాటింగ్ అవకాశం వచ్చినా భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయారు. మరోసారి చెపాక్ స్టేడియంలో ఓపెనర్లు డెవాన్ కాన్వే(12), రచిన్ రవీంద్ర(4)లు విఫలం అయ్యారు. మోయిన్ అలీ బౌలింగ్లో డెవాన్ కాన్వే స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగడంతో మొదలు చెన్నై వికెట్ల పతనం మొదలైంది.
He picks wickets ☝ He takes blinders 👏
🎥 A brilliant catch from Varun Chakaravarthy 💪
Vaibhav Arora too joins the wickets tally 🔥
Updates ▶ https://t.co/gPLIYGiUFV#TATAIPL | #CSKvKKR | @KKRiders | @chakaravarthy29 pic.twitter.com/BIFVCiYo4Z
— IndianPremierLeague (@IPL) April 11, 2025
కాసేపటికే హర్షిత్ రానా వేసిన షార్ట్ పిచ్ బంతికి రచిన్ రవీంద్ర(0) బోల్తా పడ్డాడు. 16 పరుగులకే 2 కీలక వికెట్లు పడిన దశలో విజయ్ శంకర్ (29), రాహుల్ త్రిపాఠి(16)లు కాసేపు ధాటిగా ఆడుతున్నారు. దాంతో, సీఎస్కే ఆరు ఓవర్లకు 31 రన్స్ కొట్టింది. కానీ, ఆ తర్వాత సునీల్ నరైన్(3-13) తిప్పేశాడు. శంకర్, దీపక్ హుడా(0)లను వరుణ్ చక్రవర్తి ఔట్ చేయగా.. అశ్విన్(1)ను హర్షిత్ రానా పెవిలియన్ పంపాడు. జడేజా(0)ను , ఎంఎస్ ధోనీ(1)ని ఎల్బీగా ఔట్ చేసి సీఎస్కే భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు నరైన్. ప్రధాన ఆటగాళ్లంతా డగౌట్ చేరడంతో శివం దూబే(31 నాటౌట్)కు సహరించేవాళ్లు కరువయ్యారు. వైభవ్ అరోరా బౌలింగ్లో నూర్ అహ్మద్(1) కొట్టిన బంతిని వెంకటేశ్ అయ్యర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. అంతే. 79 వద్ద 8వ వికెట్ పడింది. ఆ తర్వాత దూబే 19వ ఓవర్లో బౌండరీతో కొట్టాడు. 20వ ఓవర్లో ఫైన్ లెగ్ దిశగా ఫోర్.. ఆఖరి బంతికి బౌండరీ సంధించి స్కోర్ 100 దాటించాడు. దాంతో, సీఎస్కే 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేయగలిగింది.
Innings Break!#KKR produce a bowling and fielding masterclass to restrict #CSK to their lowest total at home 🔥💜
Drop an emoji 👇 to describe KKR’s performance!
Scorecard ▶ https://t.co/gPLIYGimQn#TATAIPL | #CSKvKKR | @KKRiders pic.twitter.com/H2b6ZwDvMq
— IndianPremierLeague (@IPL) April 11, 2025