World Cup Qualifiers : ఐసీసీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2025లో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ (West Indies) అదరగొట్టింది. స్కాట్లాండ్ చేతిలో ఓటమి నుంచి తేరుకున్న విండీస్ ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో ఐర్లాండ్(Ireland)ను ఓడించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (4-24) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో వరల్డ్ కప్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. శుక్రవారం జరిగిన పోరులో 182 లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్.. 6 పరుగుల తేడాతో గెలుపొందింది ఆఖరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా.. అల్లెయె కెల్లీ(18) ని బౌల్డ్ చేసిన మాథ్యూస్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
వర్షం కారణంగా మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్. కెప్టెన్ హేలీ మాథ్యూస్(23), ఓపెనర్ క్వియానా జోసెఫ్ 4 పరుగులకే ఔటయ్యారు. 29వ ద్దే రెండు వికెట్ల పడినా సరే.. జైదా జేమ్స్(36)తో కలిసి స్టెఫానీ టేలర్(46) ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ఆ తర్వాత వచ్చిన చినెల్లె హెన్రీ(46 నాటౌట్) కడదాకా నిలబడి జట్టుకు భారీ స్కోర్ అందించింది.
West Indies hold their nerve in a thriller to keep their World Cup qualification hopes alive!
Hayley Matthews finishes with 4/24 as Ireland fall short of a big upset in Lahore
Scorecard: https://t.co/O006VBTmmj pic.twitter.com/ZtYpBqa1iO
— ESPNcricinfo (@ESPNcricinfo) April 11, 2025
అనంతరం ఛేదనలో ఐర్లాండ్ ఓపెనర్లు అమీ హంటర్(48), గాబీ లెవిస్(17) దంచికొట్టారు. తొలి వికెట్‌కు 52 రన్స్ జోడించి విజయానికి గట్టి పునాది వేశారు. అయితే.. మాథ్యూస్ విజృంభణతో ఐరిష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మిడిల్ ఓవర్లలో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన లారా డెలానీ(32), కౌట్లర్ కెల్లీ(26)లను అలియాహ్ అల్లెయ్నే వెనక్కి పంపి ఐర్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టింది. చివర్లో ధాటిగా ఆడిన అల్లెయె కెల్లీని() ఔట్ చేసిన మాథ్యూస్ విండీస్‌ను గెలిపించింది.