రామవరం, ఏప్రిల్ 11 : సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్నఇవ్వాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేశ్ అన్నారు. శుక్రవారం సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణంలో మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపేశ్ మాట్లాడుతూ.. అంటరానితనం నిర్మూళన, స్త్రీ విద్యకు పాటుపడటం, సమ సమాజ స్థాపనకు జ్యోతిరావు పూలే కృషి చేసినట్లు చెప్పారు.
మహాత్మ జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలన్నారు ఎందుకంటే 1954లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిబిసి టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురువులు ముగ్గురు గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే, కబీర్ దాస్ అని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, జిల్లా నాయకులు మాతంగి లింగయ్య, కొత్తూరు మదనయ్య, సావటి స్వామి, కూరగాయల శ్రీను, ఇండిగపల్లి శంకర్, కాంపెళ్లి దుర్గయ్య, తిప్పారపు ఎల్లయ్య, నాగేల్లి మొగిలి, శనిగారపు కుమారస్వామి, కొత్తూరి రవి, మాటేటి అంజయ్య, మద్దికుంట గణేశ్, నమిల్ల మధు, అన్నవరం, ఎస్.కె నాగుల్ మీరా, వెంకట్రావు పాల్గొన్నారు.