IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ విజయం సాధించింది. చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను చిత్తుగా ఓడించింది. బంతితో చెలరేగిన సునీల్ నరైన్(44, 3-13) ఆపై సిక్సర్లతో విరుచుకుపడగా.. ఓపెనర్ క్వింటన్ డికాక్(23) ధాటిగా ఆడాడు. కెప్టెన్ అజింక్య రహానే (20నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్)లు దూకుడుగా ఆడి 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించారు. టాపార్డర్ జోరుతో డిఫెండింగ్ ఛాంపియన్ 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ ఎడిషన్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ సీఎస్కే గెలుపు తలుపు తట్టలేకపోయింది.
ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు 18వ సీజన్ ఏమాత్రం కలిసి రావడం లేదు. బ్యాటింగ్‌లో సమిష్టి వైఫల్యం ఆ జట్టును వెంటాడుతోంది. ఫలితంగా ప్రతి మ్యాచ్‌లో భారీ మూల్యం చెల్లించుకుంటోంది సీఎస్కే. శుక్రవారం చెపాక్‌లో విజయగర్జనతో అభిమానులను అలరించాలనుకున్న ధోనీ బృందానికి మళ్లీ నిరాశే మిగిలింది. 104 పరుగులస్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా ఆడుతూపాడుతూ ఛేదించింది.
Unstoppable 💥
🎥 After his bowling brilliance, Sunil Narine hammered the ball all around during his 18-ball 4️⃣4️⃣
Updates ▶ https://t.co/gPLIYGimQn#TATAIPL | #CSKvKKR | @KKRiders pic.twitter.com/r2ZUETFOEU
— IndianPremierLeague (@IPL) April 11, 2025
ఓపెనర్లు క్వింటన్ డికాక్(23), సునీల్ నరైన్(44 :18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు)లు తొలి వికెట్‌కు 41 రన్స్ జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే.. అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్‌లు ఈ ఇద్దరినీ బౌల్డ్ చేసి బ్రేకిచ్చారు. ఆ తర్వాత అజింక్యా రహానే(20 నాటౌట్) రింకూ సింగ్(15 నాటౌట్)నింపాదిగా ఆడి జట్టును గెలిపించారు. జడేజా వేసిన 11వ ఓవర్ తొలి బంతిని రింకూ సిక్సర్‌గా మలవగా 8 వికెట్లతో కోల్‌కతా విజయం సాధించింది. భారీ విక్టరీతో కోల్‌కతా రెండు పాయింట్లతో పాటు మెరుగైన రన్‌రేటు సొంతం చేసుకోనుంది.
కీలక మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. తమ సొంత మైదానమైన చెపాక్‌లో దంచలేక చేతులెత్తేశారు. మొదట బ్యాటింగ్ అవకాశం వచ్చినా భారీ లక్ష్యాన్ని నిర్దేశించ లేకపోయారు. టర్నింగ్ పిచ్ మీద కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్ అస్త్రం సునీల్ నరైన్(3-13) విజృంభణతో సీఎస్కే ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. విజయ్ శంకర్(29), రాహుల్ త్రిపాఠి(16).. లు కాసేపే నిలబడ్డారంతే.
Spinners 𝙍𝙞𝙙𝙞𝙣𝙜 their magic 🎩
Ft. Sunil Narine and Varun Chakaravarthy 💜
Updates ▶ https://t.co/gPLIYGimQn#TATAIPL | #CSKvKKR | @KKRiders pic.twitter.com/0pZPBNxS4g
— IndianPremierLeague (@IPL) April 11, 2025
శంకర్, దీపక్ హుడా(0)లను వరుణ్ చక్రవర్తి ఔట్ చేయగా.. అశ్విన్(1)ను హర్షిత్ రానా పెవిలియన్ పంపాడు. జడేజా(0)ను , ఎంఎస్ ధోనీ(1)ని ఎల్బీగా ఔట్ చేసి సీఎస్కే భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు నరైన్.సిక్సర్ల శివం దూబే (31 నాటౌట్) తనదైన శైలిలో సైతం బౌండరీలు కొట్టలేకపోయాడు. డెత్ ఓవర్లలో మూడు బౌండరీలతో 100 దాటించి.. జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ఈ ఎడిషన్‌లో ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం.