James Anderson : వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson)కు అరుదైన గౌరవం లభించనుంది. ఇంగ్లండ్ క్రికెట్‌కు 21 ఏళ్లు విశేష సేవలందించిన ఈ మాజీ స్పీడ్‌స్టర్‌కు నైట్‌హుడ్ బిరుదును స్వీకరించనున్నాడు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) జిమ్మీ పేరును సిఫారసు చేశారు. దాంతో, ప్రభుత్వం ఈ పేస్ గన్‌కు త్వరలోనే ఈ అవార్డును బహూకరించనుంది. నైట్‌హుడ్ మెడల్ తీసుకున్న తర్వాత నుంచి అండర్సన్ పేరు ముందర ‘Sir’ పదం చేరుతుంది. ఇకపై అందరూ అతడిని ‘సర్ అండర్సన్’ అని సంబోధిస్తారు.
అంతేకాదు ఈ అవార్డుకు కన్జర్వేటిప్ పార్టీ ప్రధాని నామినేట్ చేసిన రెండో మాజీ ఆటగాడిగా అండర్సన్ గుర్తింపు సాధించాడు. 2019లో థెరీసా మే.. జెఫ్రీ బాయ్‌కాట్‌ను నైట్‌హుడ్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అత్యున్నత గౌరవంతో తనతో కలిసి ఆడిన ఆండ్రూ స్ట్రాస్, అలెస్టర్ కుక్ల సరసన చేరునున్నాడీ లెజెండ్. ఇప్పటివరకు 12 మంది ఇంగ్లండ్ మాజీలు ఈ అవార్డు అందుకున్నారు.
Congratulations, Sir Jimmy Anderson 👑
Our bowling legend has been awarded a knighthood as part of Rishi Sunak’s resignation honours list 🎖️ pic.twitter.com/EnnGucqWsE
— England Cricket (@englandcricket) April 11, 2025
ఇంగ్లండ్ గొప్ప బౌలర్లలో ఒకడైన అండర్సన్ సుదీర్ఘ కెరియర్లో సంచలన బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. అయితే.. టెస్టు బౌలర్‌గానే ఎక్కువ ప్రభావం చూపించాడీ పొడగరి పేసర్. బాల్ క్రికెట్లో 704 వికెట్లతో రికార్డు సృష్టించాడు. 2015 నుంచి వన్డేలు, టీ20లు ఆడకున్నా సరే అండర్సన్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. వన్డేల్లో 269.. పొట్టి క్రికెట్లో 18 వికెట్లు పడగొట్టాడీ మాజీ పేసర్.