NADA : ప్రముఖ కోచ్ నాగపురి రమేష్(Nagapuri Ramesh)పై వేటు పడింది. దేశం గర్వపడేలా యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న అతడిపై జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ(నాడా) నిషేధం విధించింది. ఆయన వద్ద శిక్షణ పొందిన ఇద్దరు అథ్లెట్లు డోపింగ్ టెస్టు(Dope Test)కు నిరాకరించడమే అందుకు కారణం. అయితే.. తానేమీ తప్పు చేయలేదని విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని రమేష్ తెలిపాడు. డోప్ టెస్టుకు సహకరించనందుకు రమేష్‌తో పాటు కోచ్‌లు కరంవీర్ సింగ్, రాకేష్‌లు కూడా సస్పెన్సన్‌కు గురయ్యారు.
ఈమధ్యే కొందరు అథ్లెట్లు డోపింగ్ పరీక్షలకు నమూనాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. పరాస్ సింఘాల్, పూజా రాణి, నలుబోతు షన్ముగ శ్రీనివాస్, చెలిమి ప్రత్యూష, శుభమ్ మహరా, కిరణ్. జ్యోతిలు డోప్ టెస్టుకు తమ రక్త నమూనాలు ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నాడా అందుకు కోచ్‌లను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన నాగపురి రమేశ్‌పై వేటు వేసింది.
National Junior Athletics Coach, Ramesh Nagapuri, Suspended@cheerica reports pic.twitter.com/6fcE8w7U3O
— NDTV (@ndtv) April 20, 2025
అయితే.. నాడా తీరుపై రమేష్ మండిపడ్డాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై సస్పెన్సన్ విధించడం సరికాదని.. తానేమీ తప్పు చేయలేదని మీడియాకు వివరించాడీ కోచ్. తెలంగాణతో పాటు యావత్ దేశంలోని పలువురు యువ అథ్లెట్లు రమేష్ శిక్షణలో రాటుదేలుతున్నారు. ఆయన సూచనలతో, సలహాలతో మెరుగుపడిన స్ప్రింటర్ ద్యూతీ చంద్, జ్యోతి ఎర్రాజీలు ఒలింపిక్స్‌లో సత్తా చాటిన విషయం తెలిసిందే.