IPL 2025 : పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 158 పరుగుల ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగుతున్నారు. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్(51) హాఫ్ సెంచరీ సాధించాడు. చాహల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో అతడికి ఇది ఐదో ఫిఫ్టీ. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ(42)సైతం దూకుడుగా ఆడుతున్నాడు. దాంతో, ఆర్సీబీ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఇంకా విజయానికి బెంగళూరుకు 54 బంతుల్లో 63 రన్స్ కావాలి.
ముల్లనూర్‌లో పంజాబ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన ఆర్సీబీ విజయం దిశగా సాగుతోంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(1) తొలి ఓవర్లోనే వెనుదిరిగినా.. విరాట్ కోహ్లీ(42), ఇంప్యాక్ట్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్(51)లు ధాటిగా ఆడుతున్నారు. రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడి ఆర్సీబీని గెలుపు వైపు నడిపిస్తోంది.