Murali Vijay | మురళీ విజయ్ రిటైర్మెంట్.. దినేశ్ కార్తీక్ భార్యతో ప్రేమ వివాహం కథ తెలుసా..
ఆట కంటే.. బయటి విషయాలతోనే ఎక్కువ వార్తల్లోకెక్కిన క్రికెటర్ మురళీ విజయ్ ( Murali Vijay ) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమ్ఇండియా తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన మురళీ విజయ్ ఆటలోని అన్నీ ఫార్మట్లకు రిటర్మైంట్ ప్రకటించాడు.
Murali Vijay | చెన్నై: మైదానంలో ఆట కంటే.. గ్రౌండ్ బయటి విషయాలతోనే ఎక్కువ వార్తల్లోకెక్కిన భారత వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్ ( Murali Vijay ) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమ్ఇండియా తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన ఈ తమిళనాడు ఓపెనర్.. ఆటలోని అన్నీ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం సామాజిక మాధ్యమాల వేదికగా స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లలో 4490 పరుగులు చేసిన విజయ్.. భవిష్యత్తులోనూ ఆటతోనే కొనసాగుతానని పేర్కొన్నాడు.
గౌతమ్ గంభీర్ ( Gautham Gambhir ) గైర్హాజరీలో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న విజయ్.. ఆ తర్వాత కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. 2013 డిసెంబర్ నుంచి 2015 జనవరి వరకు అతడి కెరీర్ అత్యుత్తమ దశలో కొనసాగింది. ఈ పరిధిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా ( Team India ) టెస్టు సిరీస్‌లు ఆడగా.. విజయ్ రెగ్యులర్ ఓపెనర్‌గా అన్నీ మ్యాచ్‌లు ఆడాడు. ఈ నాలుగు పర్యటనల్లో కలిపి భారత్ తరఫున అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్‌గా నిలిచిన విజయ్.. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మూడో ఇన్నింగ్స్‌లో 95 పరుగులతో సత్తాచాటాడు. కెరీర్లో 12 శతకాలు సాధించినా.. లార్డ్స్‌లో క్లిష్ట పరిస్థితుల్లో చేసిన 95 పరుగులే విజయ్ అత్యుత్తమ ఇన్నింగ్స్ అనడంలో సందేహం లేదు.
స్నేహితుడి భార్యతో ప్రేమ వ్యవహారం..
అయితే సుదీర్ఘ ఫార్మాట్‌కు సరిపడే ఆటతీరుతో జట్టులో కొనసాగిన విజయ్.. స్నేహితుడి భార్యతో ప్రేమ వ్యవహారం నడిపి వార్తల్లోకెక్కాడు. తమిళనాడుకు చెందిన మురళి విజయ్.. సొంత రాష్ర్టానికి చెందిన దినేశ్ కార్తీక్ మొదటి భార్య నిఖిత వంజరను ప్రేమించాడు. ఇద్దరు కలిసి రంజీ మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో దినేశ్ కార్తీక్ భార్యతో సన్నిహితంగా గడిపాడు.
2007లో దినేశ్ కార్తీక్, నిఖిత వంజర వివాహం అంగరంగ వైభవంగా జరగగా.. ఐదేండ్లు తిరిగేసరికి వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అదే సమయంలో దినేశ్ కార్తీక్, మురళీ విజయ్ ఒకే జట్లకు ఆడుతుండగా, నిఖిత.. విజయ్‌కు దగ్గరైంది. చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులైన కార్తీక్, నిఖిత మధ్య అభిప్రాయభేదాలను మురళీ విజయ్ వినియోగించుకున్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. 2012లో రంజీ ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో మ్యాచ్ సందర్భంగా నిఖిత, విజయ్ సన్నిహితంగా ఉండటం కార్తీక్ కంటబడింది. దీంతో ఇక తెగతెంపులు చేసుకోవడమే మంచిదని భావించిన కార్తీక్.. నిఖితకు విడాకులిచ్చాడు.
అయితే అధికారికంగా విడాకులు మంజూరు కావడానికి ముందే మురళీ విజయ్‌తో గర్భందాల్చిన నిఖిత ఆ తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటనతో విజయ్, కార్తీక్ మధ్య స్నేహం చెడిపోగా.. ఆ తర్వాత విరిద్దరూ కలిసి జాతీయ జట్టుకు ఆడిన సందర్భంలోనూ ఎడమొహం పెడమొహంగానే కనిపించారు. 2018 టెస్టు సిరీస్ సందర్భంగా విజయ్, కార్తీక్ మాట్లాడుకోలేదని అప్పటి జట్టు సహాయసిబ్బంది వెల్లడించారు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ దీపిక పళ్లికల్‌ను పెళ్లాడాడు. ఫిట్నెస్ ట్రైనింగ్‌లో భారత నంబర్‌వన్ స్కాష్ ప్లేయర్ దీపికను కలిసిన కార్తీక్.. ఆ తర్వాత ఆమెనే ప్రేమించి పెళ్లాడాడు. వీరికి కవల పిల్లలు ఉన్నారు.
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023
Read More :
WTC 2023 | డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో భారత్ స్థానం పదిలం.. ఆస్ట్రేలియాకు షాక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- cricket
- dinesh karthik
- ICC
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

