SA20 Final | రిజర్వ్ డేన దక్షిణాఫ్రికా20 లీగ్ ఫైనల్.. కారణం ఇదే..!
దక్షిణాఫ్రికా తొలిసారి నిర్వహిస్తున్న ఎస్ఏ 20 ఫైనల్ రిజర్వ్ డేన జరగనుంది. వర్షం కారణంగా ఈ రోజు ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రేపటికి (ఫిబ్రవరి 12) వాయిదా పడింది.
SA20 Final : దక్షిణాఫ్రికా తొలిసారి నిర్వహిస్తున్న ఎస్ఏ 20 ఫైనల్ రిజర్వ్ డేన జరగనుంది. వర్షం కారణంగా ఈ రోజు ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రేపటికి (ఫిబ్రవరి 12) వాయిదా పడింది. రిజర్వ్ డే ఫైనల్ నిర్వహించనున్నట్టు ఎస్ఏ 20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ వెల్లడించాడు. టైటిల్ పోరును అభిమానులకు ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారని అతను అన్నాడు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఆదివారం 1ః30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్‌కు వేదికైన జొహన్నెస్‌బర్గ్‌లో గత రెండు మూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. అందుకని దాంతో, మ్యాచ్‌కు పిచ్‌ను సిద్ధం చేయడం సాధ్యపడలేదు
‘మ్యాచ్ కోసం గ్రౌండ్‌ను సిద్ధం చేయడంలో రాజీ పడాల్సి వచ్చింది. గత మూడు రోజులగా పిచ్ తడవకుండా కప్పేశాం. ఈరోజు కూడా వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొన్నవాళ్లను రిజర్వ్ డేన స్టేడియంలోకి అనుమతిస్తాం’ అని నిర్వాహకులు తెలిపారు.
మరక్రం సెంచరీ
ఎడెన్ మరక్రం సారథ్యంలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను 14 రన్స్‌తో ఓడించి ఫైనల్ చేరింది. మరక్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. అతను 58 బంతుల్లో సెంచరీ బాదాడు. రెండో సెమీఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్ 29 రన్స్ తేడాతో పార్ల్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్ కెప్టెన్ రిలే రసౌ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

