IPL 2025 : ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుపొందిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఈసారి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. వరుసగా రెండు ఓటములు.. ఆపై డబుల్ హ్యాట్రిక్ విజయాలతో టాప్‌లోకి దూసుకొచ్చింది ముంబై. అయితే.. ఐపీఎల్ వాయిదా పడడం.. కొత్త షెడ్యూల్ ప్రకటనతో కీలక ఆటగాళ్లు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాండ్యా సేన బ్యాకప్‌గా ప్రతిభావంతులైన ఆటగాళ్లను తీసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్(Will Jacks) లీగ్ మ్యాచ్‌ల తర్వాత స్వదేశం వెళ్లిపోతాడు.
ఒకవేళ ముంబై ప్లే ఆఫ్స్ చేరితే.. అతడి స్థానంలో జానీ బెయిర్‌స్టో(Jonny Bairstow)ను తీసుకోవాలని ముంబై యాజమాన్యం భావిస్తోంది. ఇదే విషయమై ఈ చిచ్చరపిడుగుతో చర్చలు జరుపుతోంది. 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓపెనర్‌గా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన జానీ.. ముంబైకి లక్కీ హ్యాండ్ అవుతాడని ఫ్రాంచైజీ అనుకుంటోంది.
Jonny Bairstow is in advanced talks to sign with Mumbai Indians as a temporary replacement for Will Jacks if they qualify for the #IPL2025 playoffs
More details: https://t.co/ivzsCYTXD2 pic.twitter.com/KVGNQZFnRk
— ESPNcricinfo (@ESPNcricinfo) May 15, 2025
ప్రస్తుతం హార్ధిక్ పాండ్యా బృందం నాలుగో స్థానంలో ఉంది. ముంబైకి ఇంకా రెండు లీగ్ మ్యాచులే ఉన్నాయి. అవి కూడా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మే 21న , పంజాబ్ కింగ్స్‌తో మే 26న. ఇరుజట్లకు ఈ గేమ్స్ చాలా ముఖ్యం. ఒకవేళ వీటిలో ఓడిపోతే ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యే అవకాశముంది.
విదేశీ క్రికెటర్లలో కొందరు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండరు. కాబట్టి పలు జట్లు వాళ్ల స్థానంలో మరొకరిని తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశాయి. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ గురువారం శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్‌తో ఒప్పందం చేసుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ స్థానంలో మెండిస్‌ను స్క్వాడ్‌లోకి తీసుకుంది.
Punjab Kings sign Kyle Jamieson as a replacement for Lockie Ferguson, who has been ruled out of the remainder of #IPL2025 due to a hamstring injury pic.twitter.com/bVWLkhvCco
— ESPNcricinfo (@ESPNcricinfo) May 15, 2025
పంజాబ్ కింగ్స్ సైతం టోర్నీ నుంచి నిష్క్రమించిన లాకీ ఫెర్గూసన్ స్థానంలో న్యూజిలాండ్‌కే చెందిన కైలీ జేమీసన్‌ను తీసుకుంది. ఈసారి ఎలాగైనా కొట్టాలనుకుంటున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.