IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో చివరి ప్లే ఆప్స్ బెర్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, బెంగళూరు జట్లు నాకౌట్‌కు దూసుకెళ్లగా.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య పోటీ నెలకొంది. ఈ సీజన్లో అదరగొడుతున్న ఇరుజట్లు బుధవారం వాంఖడేలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. అయితే. వర్షం ముప్పు ఉన్నందున పూర్తిగా 20 ఓవర్ల ఆట సాధ్యమవుతుందా? అనేది సందేహంగా ఉంది.
మాజీ ఛాంపియన్ అయిన ముంబై మరోసారి ప్లే ఆఫ్స్‌పై కన్నేయగా.. తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ ఎలాగైనా గెలుపొందాలనే కసితో ఉంది. ఈ నేపథ్యలో అక్షర్ పటేల్ బృందం సమిష్టిగా రాణించాలని భావిస్తోంది. ముంబై మాత్రం ఎప్పటిలానే ఓపెనర్లు, సూర్య, తిలక్‌పై.. పేస్ బౌలింగ్ యూనిట్‌పై భరోసా ఉంచుతోంది.
𝙎𝙩𝙤𝙧𝙢 alert in Wankhede 🔥🌪#MI take on #DC in a clash with everything on the line 😬#TATAIPL | #MIvDC | @mipaltan | @DelhiCapitals pic.twitter.com/q7mT5Ut1zk
— IndianPremierLeague (@IPL) May 21, 2025
పద్దెనిమిదో సీజన్లో వరుసగా రెండు ఓటములు పలకరించిన వేళ.. వాంఖడేలోనే ముంబై బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాను ఓడించిన పాండ్యా సేన ఆ తర్వాత ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే.. ఢిల్లీపై విజయంతో ట్రాక్‌లో పడిన ముంబై.. వరుసగా ఆరు మ్యాచుల్లో జయభేరి మోగించి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), రియాన్ రికెల్టన్ (Riyan Rickelton)లు శుభారంభాలు ఇస్తుండగా.. మిడిల్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు దంచికొడుతున్నారు.
రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మ
ఆపై బుమ్రా, బౌల్ట్, చాహర్‌లు ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తూ పవర్ ప్లేలోని వికెట్లు తీసి ముంబైకి బ్రేకిస్తున్నారు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా కరణ్ శర్మ (Karan Sharma) మ్యాచ్ విన్నర్‌గా మారడం మాజీ ఛాంపియన్‌ను ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ చేసింది. మంగళవారం కూడా ముంబై టాప్ గన్స్ చెలరేగితే ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతవ్వడం ఖాయం. అయితే.. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్న ఆ జట్టును ముంబై పేసర్లు ఎంతలోపు కట్టడి చేస్తారు? అనేదానిపై పాండ్యా జట్టు గెలుపు అవకాశాలు ఉన్నాయి.
సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టైటిల్ ఫేవరెట్‌గా మారిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత తడబడింది. ఓపెనర్‌గా ఒక్క మ్యాచ్‌లోనే ఇరగదీసిన కరుణ్ నాయర్ (Karun Nair) ఆ తర్వాత విఫలమవుతున్నాడు. దాంతో, ఢిల్లీకి శుభారంభం లభించడం పెద్ద సమస్యగా మారింది. అయితే.. మిడిల్ ఓవర్లలో దంచేస్తూ.. ఢిల్లీ పాలిట ట్రబుల్ షూటర్లా మారిన కేఎల్ రాహుల్ (KL Rahul) విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. కుర్రాడు ట్రిస్టన్ స్టబ్స్, ఆశుతోష్ శర్మలు ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు శుభపరిణామం. కానీ, పేస్ బౌలింగ్ యూనిట్ మాత్రం మెరుగవ్వాల్సి ఉంది. ఎందుకంటే.. ఐపీఎల్ వాయిదా పడడంతో మిచెల్ స్టార్క్(Mitchell Starc) సేవల్ని ఢిల్లీ కోల్పోయింది. పదునైన యార్కర్లు సంధిస్తూ.. బ్యాటర్లను భయపెట్టే ఆ ఆసీస్ స్పీడ్‌స్టర్ లేని లోటు గుజరాత్ మ్యాచ్‌లో కనిపించింది.
రాహుల్, మిచెల్ స్టార్క్
రాహుల్ సూపర్ సెంచరీతో 219 రన్స్ కొట్టిన అక్షర్ పటేల్ బృందం గెలుపు ఖాయం అనుకుంది. కానీ, స్టార్క్, ముకేశ్ కుమార్ల గైర్వాజరీలో గుజరాత్ యువ ఓపెనర్లు సాయిసుదర్శన్, శుభ్‌మన్ గిల్ జోడీని కట్టడి చేసే బౌలర్ కరువయ్యాడు. పేసర్లు ముస్తాఫిజుర్, నటరాజన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అక్షర్, కుల్దీప్ సైతం తేలిపోగా.. గుజరాత్ 10 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యేవి. కానీ.. బౌలింగ్‌లో తేలిపోయిన ఢిల్లీ.. చివరి రెండు లీగ్ మ్యాచుల్లో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది.
These sides know how to turn Clutch Mode 🔛
Who will add to their impressive record in this BIG game? 🤔#TATAIPL | #MIvDC | @mipaltan | @DelhiCapitals pic.twitter.com/hI4dhIz1mA
— IndianPremierLeague (@IPL) May 21, 2025
అయితే.. వాంఖడేలో ముంబై గెలిచిందంటే అక్షర్ పటేల్ సేన ఇంటిదారి పట్టాల్సిందే. అలా కాకుండా పాండ్యా బృందానికి ఢిల్లీ షాకిస్తే.. ఇరుజట్ల చివరి లీగ్ మ్యాచ్(పంజాబ్ కింగ్స్‌తో)లో గెలుపొందిన జట్టు ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించకుంటే.. 200 ప్లస్ స్కోర్ నమోదయ్యే అవకాశముంది. అదే జరిగితే.. ఇప్పటివరకూ రెండొందల ప్లస్ కొట్టిన 17 మ్యాచుల్లో ముంబై గెలుపొందింది. 14 పర్యాయాలు 200 ప్లస్ చేసిన ఢిల్లీ 13 మ్యాచుల్లో ప్రత్యర్థికి చెక్ పెట్టింది.
Solid walls of 𝙙𝙚𝙛𝙚𝙣𝙨𝙚 ✋👊