IPL 2025 : ప్లే ఆప్స్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అదనపు గంట సమయం కేటాయించిన విషయం తెలిసిందే. వర్ష సూచన ఉన్నందున కీలకమైన మ్యాచ్‌లు రద్దు కాకూడదనే ఉద్దేశంతో బీసీసీఐ (BCCI) ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అయితే.. ఈ నియమంపై కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఐపీఎల్ పునరుద్ధరణతోనే అదనపు గంట సమయం ప్రస్తావని ఎందుకు తీసుకురాలేదు? .. మేము ప్లే ఆఫ్స్ అవకాశం కోల్పోయాం’ అని తమకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించాడు కోల్‌కతా సీఈవో వెంకీ మైసూర్ (Venky Mysore).
‘సీజన్ మధ్యలో నిబంధనలు మార్చడం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనివారం కావచ్చు. కానీ, ఇలాంటి మార్పులు తీసుకోనేటప్పుడు స్థిరత్వం ఉండాలి’ అని ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమిన్ (Hemang Amin)కి వెంకీ ఈమెయిల్ పంపాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ మే 17 నుంచి మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కోల్‌కతా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయ్యింది. కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యపడదని తేల్చడంతో.. కోల్‌కతా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఇదే విషయాన్ని తన ఈమెయిల్లో వెంకీ ప్రస్తావించాడు.
Rain, rain go away! KKR and RCB want to play 🌧️ 😕 pic.twitter.com/vtCB6PEMFK
— KolkataKnightRiders (@KKRiders) May 17, 2025
‘ఐపీఎల్ పునరుద్ధరణ తర్వాత మే 17న తొలి మ్యాచ్. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఆర్సీబీ, కోల్‌కతా ఇరుజట్లకు అది చాలా కీలకమైన గేమ్. మే 15న భారీ వర్షం కారణంగా చిన్నస్వామి స్టేడియం ఈతకొలనును తలపించింది. మే 17న మ్యాచ్ సమయానికి వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది కూడా. అయినా సరే.. బీసీసీఐ.. ఐపీఎల్ సీఓఓలు మౌనంగా ఉన్నారు. అనుకున్నట్టే వాన కారణంగా మ్యాచ్ రద్దయ్యింది.
— KolkataKnightRiders (@KKRiders) May 17, 2025
ఒకవేళ అప్పుడే మీరు అదనపు గంట సమయం ఉంటుందని చెప్పి ఉంటే కనీసం 5 ఓవర్ల ఆట అయినా సాధ్యపడేది. ఇప్పుడేమో మే 20 నుంచి ఎక్స్ ట్రా టైమ్ వర్తిస్తుందని చెబుతున్నారు. అదేదే ముందే ఆలోచించి ఉంటే బాగుండు.. మేము నష్టపోయేవాళ్లం కాదు’ అని కోల్‌కతా సీఈఓ వెంకీ తమ ఆక్రోషాన్ని వెల్లగక్కాడు. కోల్‌కతా ఒక్కటే కాదు.. మరకొన్ని జట్లు కూడా సీజన్ మధ్యలో నిబంధనల మార్పును తప్పుపడుతున్నాయి. కోల్‌కతా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మే 25న ఢీకొట్టనుంది.