Niranjan Reddy | మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తిలోని 23వ వార్డులో ఆయన ఓటు వేశారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, నిష్పక్షపాతంగా జరగడం లేదని నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రధానంగా పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా,స్వేచ్ఛగా జరగనివ్వాలని సూచించారు.