హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట మధ్య మెట్రో కారిడార్- 4 పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. సంబంధిత భూసేకరణపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. కానీ, భూసేకరణ చట్టబద్ధత అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంటుందని, దీనిపై తుది విచారణలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
భూసేకరణలో అసమానత లు ఉన్నాయంటూ మహ్మద్ అబ్దుల్ రవూఫ్ సహా 8 మంది దాఖలు చేసిన వ్యాజ్యంలో స్టేను ఎత్తివేయాలని ప్ర భుత్వం కోరింది. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపించారు.