నల్లబెల్లి, ఆగస్టు 10 : పెద్దికి సంబంధించిన 17 నిమిషాల నిడివితో ప్రత్యేకమైన డాక్యుమెంటరీని ప్రదర్శించగా, తిలకిస్తూ చాలా మంది భావోద్వేగానికి గురయ్యా రు. బాధాతప్త హృదయాలతో కన్నీటిని ఆపుకోలేక పోయారు. సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్న భోరున విలపించడంతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సైతం కన్నీరు కార్చారు.
జై పెద్దన్నా.. అంటూ ప్రతి ఒక్కరూ సభ లో నినదించారు. ఎంత కాలం బతికామన్నది కాదు.. పెద్దన్నలా ఎట్లా బతికామన్నదే ముఖ్యమని పార్టీ నేతలు, అభిమానులు, నాయకులు, అన్ని వర్గాల ప్రజలు కొనియాడారు. సుమారు 40 వేలమంది తరలివచ్చి సుదర్శన్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.