Bhupalapally | మున్సిపల్ ఎన్నికల వేళ డబ్బుల పంపిణీ.. పోలింగ్ బూత్ సమీపంలో రూ.లక్ష స్వాధీనం
Bhupalapally | మున్సిపల్ ఎన్నికల వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలింగ్ కేంద్రం సమీపంలో రూ.లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Bhupalapally | మున్సిపల్ ఎన్నికల వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలింగ్ కేంద్రం సమీపంలో రూ.లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22వ వార్డులోని పోలింగ్ కేంద్రం సమీపంలోని ఒక బండ కింద డబ్బులు దాచి, ఓటర్లకు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో ఉన్న డబ్బును పోలీసులు సీజ్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు ఈ డబ్బులను పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బుర్రా సదానందాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కాంగ్రెస్ ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పట్టుబడిన సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అట్టర్‌ప్లాప్
జనగామలో మున్సిపల్ ఎన్నికలో నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఓటర్లు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని వాపోతున్నారు. వృద్ధుల కోసం వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో వారిని చేతులపైనే మోసుకెళ్లాల్సి వస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

