కారేపల్లి, ఆగస్టు 16 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీపురం టీజీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో పదో తరగతి విద్యార్థులను ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులు శనివారం అర్ధరాత్రి చితకబాదారు. వివరాల్లోకెళ్తే.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురసరించుకొని గాంధీపురం గురుకుల కళాశాలలో విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించారు. వాలీబాల్, ఖోఖో పోటీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు, కబడ్డీ పోటీలో పదో తరగతి విద్యార్థులు గెలుపొందారు. పదో తరగతి విద్యార్థులు సెలబ్రేషన్స్ చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయిన ఇంటర్మీడియట్ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులను చితకబాదారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరించగా వారు అక్కడికి వచ్చి ఆందోళనకు దిగారు. కారేపల్లి ఎస్సై గోపి గురుకులానికి చేరుకొని విచారణ చేపట్టారు.