హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజు రూ.15 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుపడ్డారు. ఆయనతో పాటు శ్రీచందు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రూ. 179. 50 కోట్ల ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ప్రాజెక్టులో పనులు పూర్తిచేసినందుకు జాయింట్ వెంచర్ సంస్థ కు రూ.7 కోట్ల బోనస్ వచ్చింది. క్లె యిమ్ విషయంలో సహకరించేందు కు ఎస్సీఆర్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రూ.15 లక్షల లంచం డిమాండ్ చేశా రు. విజయవాడకు వచ్చిన సదర సం స్థ సిబ్బంది నుంచి బాపిరాజు రూ. 15 లక్షలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. గణపతి ఇంజినీరింగ్ వర్క్స్, యెల్లా కన్స్ట్రక్షన్ జాయింట్ వెంచర్‌కు సంబంధించిన వ్యవహారంలో ప్రైవేట్ కంపెనీ ఎండీ కుమారుడి ద్వారా లంచం చెల్లించినట్టు సీబీఐ వెల్లడించింది.