ACB Raids | నిమ్స్ వైద్యుడి ఆస్తులు 80 కోట్లు.. కండ్లు చెదిరేలా అక్రమాస్తుల చిట్టా వెలుగులోకి..!
ACB Raids | ‘లక్కీ భాస్కర్' సినిమా తరహాలో నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. సివివాదాస్పదుడిగా పేరుగాంచడం, అక్రమంగా డబ్బులు సంపాదిస్తుండటంతో ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టిపెట్టి కూపీలాగారు.
ACB Raids | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ‘లక్కీ భాస్కర్’ సినిమా తరహాలో నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. సినిమా కథనే తలదన్నేలా ప్రైవేట్ సంస్థల్లో లక్షల రూపాయల పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్‌లో లక్షల ఇన్వెస్ట్మెంట్స్, ఖరీదైన కార్లు, కోటిన్నర వరకు వడ్డీలకు తిప్పుతూ.. కళ్లు చెదిరే ఫ్లాట్లలో తన అక్రమాస్తుల సామ్రాజ్యాన్ని విస్తరించారు.
వివాదాస్పదుడిగా పేరుగాంచడం, అక్రమంగా డబ్బులు సంపాదిస్తుండటంతో ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టిపెట్టి కూపీలాగారు. ప్రాథమిక పరిశీలనలోనే భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచే ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌లో ఆయన నివాసంతోపాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సన్నిహితులకు సంబంధించిన 7 ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అవినీతి, అక్రమాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు.
రూ.80 కోట్లకు పైగానే అక్రమాస్తులు..
ఏసీబీ అధికారులు గుర్తించిన స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.6.13 కోట్లుగా ఉన్నప్పటికీ, ఆయా ఆస్తుల మారెట్ విలువ డాక్యుమెంట్లలో చూపిన విలువ కంటే అధికంగా ఉండే అవకాశం ఉన్నదని ఏసీబీ తెలిపింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.80 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా. మరిన్ని ఆస్తులపై అదనపు ధ్రువీకరణ, పరిశీలన సాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కూకట్పల్లి, మణికొండలో ఫ్లాట్లు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీటితోపాటు భువనగిరి, నందిగామ, శామీర్‌పేటలో ఓపెన్ ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోనూ 800 చదరపు గజాల స్థలం ఉన్నట్టు గుర్తించారు. లక్షల విలువైన జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ వంటి విలాసవంతమైన కార్లు, లక్షల విలువైన గ్యాడ్జెట్స్, అరకిలోకు పైగా బంగారు ఆభరణాలు ఉన్నట్టు తేల్చారు. దీనికితోడు ప్రైవేట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో లక్షలు పెట్టుబడి పెట్టినట్టు గుర్తించారు. రూ.41 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.12 లక్షల పోస్టాఫీస్ డిపాజిట్లు కూడా ఉన్నట్టు నిర్ధారించారు.
లక్ష్మీభాస్కర్ వద్ద గుర్తించిన స్థిర, చరాస్తుల వివరాలు..
- హైరైజ్ గేటెడ్‌లో ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్
- కూకట్‌పల్లిలో హైరైస్ గేటెడ్ కమ్యూనిటీలో 2 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు
- మణికొండ, పేట్ బషీరాబాద్, కూకట్‌పల్లిలో 5 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు
- యాదాద్రి భువనగిరి, నందిగామ, శామీర్‌పేటలో 4 ఓపెన్ ప్లాట్లు
- ఏపీలోని విశాఖపట్నంలో 800 చదరపు గజాల ఓపెన్ ప్లాట్
- బ్యాంకుల్లో 41 లక్షల నగదు నిల్వలు
- పోస్టాఫీసుల్లో రూ.12 లక్షల డిపాజిట్లు
- ఫైనాన్స్‌ల్లో 35 లక్షల పెట్టుబడులు
- మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.29.55 లక్షల పెట్టుబడులు
- 517.8 గ్రా. బంగారు ఆభరణాలు
- అత్యంత ఖరీదైన జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ వంటి కార్లు
- నాలుగు బైక్‌లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్
- డీఆర్టీ వివాదాస్పద ఫ్లాట్ కొనుగోలుకు రూ.1.30 కోట్లు
- వివిధ వ్యక్తులకు వడ్డీకి ఇచ్చిన మొత్తం రూ.1.33 కోట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

