ఉదయం ఉత్తమ అవార్డు.. అర్ధరాత్రి గుండెపోటు
ఉత్తమ అవార్డు అందుకొని గంటలు గడువక ముందే.. ఓ ఉద్యోగి గుండెనొప్పితో మరణించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లిలో చోటుచేసుకున్నది.
- అలంపూర్ 108 అంబులెన్స్ మెడికల్ టెక్నీషియన్ మృతి
- గద్వాల జిల్లా లో విషాదం
గద్వాల అర్బన్, ఆగస్టు 16 : ఉత్తమ అవార్డు అందుకొని గంటలు గడువక ముందే.. ఓ ఉద్యోగి గుండెనొప్పితో మరణించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లిలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా జిల్లా కేంద్రానికి అనుకొని ఉన్న చెనుగోనిపల్లికి చెందిన జహంగీర్ (27) అలంపూర్‌లో 108 అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఐదేండ్లుగా వైద్య సేవలందిస్త్తూ మన్ననలు పొందాడు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నాడు. ఉదయం అవార్డు అందుకోగా.. రాత్రి 2 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. 108 సర్వీస్‌లో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన జహంగీర్ నేడు తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడని కుటుంబసభ్యులు విలపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

