మధిర, మే 21 : మధిర సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం బెల్లంకొండ విశ్వనాదుల శ్రీనివాసాచారి, లక్ష్మి ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాలోకల్లా అన్నదానం గొప్పదన్నారు. పేదలకు, భక్తులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన మదిర సేవా సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర సేవా సమితి అధ్యక్షుడు పల్లపోతు ప్రసాదరావు, స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి, కుంచం కృష్ణారావు, చలువాది కృష్ణమూర్తి ఆర్టీసీ రిటైర్డ్, దాచేపల్లి ముత్యాలు, నంబూరి మురళీకృష్ణ, చలువాది చిన్న కృష్ణమూర్తి, వేముల నవీన్ కుమార్, వట్టే సైదులు, సముద్రాల పాపారావు పాల్గొన్నారు.