MS Dhoni | టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్‌కి కార్లు, బైక్‌లు అంటే అమితమైన పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా ఏ వాహనం వచ్చిన తన గ్యారేజీలోకి చేరాల్సిందే. ఇప్పటికే ధోనీ గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు, బైక్‌లు ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా వాటిలో రాంచీ (Ranchi) వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా ఇండియన్ ఆర్మీ (Indian Army) థీమ్‌తో ఉన్న బీస్ట్ (Beast) కారులో చక్కర్లు కొడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కార్ దేఖో ప్రకారం.. ఈ బీస్ట్ కారు ధర రూ.75 లక్షలు ఉంటుంది. దీని మాడిఫికేషన్ కోసం మరో రూ.5 లక్షల వరకూ అదనంగా ఖర్చు అయినట్లు సమాచారం.
You just look at how he modified his car; I don’t see any player who loves the Indian Army more than MS Dhoni.🇮🇳🪖 pic.twitter.com/31LzI0uPci
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 22, 2025
Also Read..
Lionel Messi: అర్జెంటీనాతో ఫ్రెండ్లీ మ్యాచ్.. కేరళకు వస్తున్న మెస్సీ
Virat Kohli | ‘ఇంప్యాక్ట్ ప్లేయర్’గా కాదు.. వీడ్కోలు పలికేంత వరకూ సింహంలా ఆడుతా..!