తిరువనంతపురం: ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్, అర్జెంటీనా జట్టు ఆటగాడు లియోనిల్ మెస్సీ( Lionel Messi) కేరళకు రానున్నాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ అబ్దుర్రహిమాన్ తెలిపారు. ఫ్రెండ్లీ మ్యాచ్లో ఆడేందుకు అతను కేరళ వస్తున్నట్లు చెప్పారు. నవంబర్ నెలలో ఆ ప్లేయర్ కేరళలో టూరు చేయనున్నాడు. తాజాగా అర్జెంటీనా ఫుట్బాల్ సంఘం కూడా ప్రకటన చేసింది. లియోనల్ స్కాలోనీ నేతృత్వంలోని జాతీయ జట్టు పలు ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడనున్నట్లు ఏఎఫ్ఏ చెప్పింది. దానిలో భాగంగానే లువాండా, అంగోలా, కేరళలో ఫ్రెండ్లీ మ్యాచ్లు ఉంటాయని పేర్కొన్నది. కేరళలో జరిగే స్నేహపూర్వక మ్యాచ్ను అక్టోబర్ లేదా నవంబర్లో నిర్వహించాలని లిఖితపూర్వక లేఖ కూడా ఇచ్చినట్లు కేరళ మంత్రి తెలిపారు.
నవంబర్ 10 నుంచి 18వ తేదీ మధ్య కొచ్చిలో ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కేరళలో అర్జెంటీనా జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నది. 2011లో ఓసారి అర్జెంటీనా జట్టు ఇండియాలో పర్యటించింది. అప్పుడు కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో వెనిజులాతో ఆడింది.
Officially announcing with pride ⚽✨#Argentina is coming to Kerala! 🇦🇷🔥
A historic football moment awaits God’s Own Country. 🌴⚽
Grateful to @reporter_tv for the support.#VAbdurahiman #SportsMinisterKerala #Messi @afa @leomessisite @leomessisite @AFASeleccionEN @TeamMessi pic.twitter.com/u926BPZ0TN— V Abdurahiman (@VAbdurahimanOff) August 23, 2025