Rinku Singh | టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూసింగ్ (Rinku Singh) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)తో ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ జంటకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. కానీ, రింకూ క్రికెట్ కమిట్మెంట్లతో పెండ్లిని కొన్ని రోజులు వాయిదా వేశారు. ఇక ప్రియతో లవ్‌స్టోరీని (Love Story) రింకూ తాజాగా రివీల్ చేశారు.
ఓ ఇంటర్వ్యూలో రింకూ సింగ్ మాట్లాడుతూ.. 2022లో కొవిడ్ సమయంలో ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు ప్రియతో ప్రేమ మొదలైనట్లు వెల్లడించారు. ‘2022లో కొవిడ్ సమయంలో ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు ప్రియతో నా ప్రేమ మొదలైంది. నాకు ఓ ఫ్యాన్ పేజ్ ఉండేది. అందులో ప్రియ ఫొటో చూసి ఇష్టపడ్డా. ఆమె నాకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నా. మెసేజ్ చేద్దాం అనుకున్నా. కానీ అది మంచి పద్దతికాదని ఆగిపోయా. కొన్ని రోజులకు ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటోలను ప్రియ లైక్ చేసినట్లు గుర్తించా. అప్పుడే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశా. అలా రోజూ మాట్లాడుకోవడం మొదలైంది.
అలా కొతంకాలం గడిచాక కలిసి జీవితాన్ని పంచుకోవాలనే అభిప్రాయానికి వచ్చాం. ప్రియ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మా ప్రేమలో ఎలాంటి మార్పూ లేదు. మొదట్లో చాలా ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టైమ్ దొరకట్లేదు. ప్రియ ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ఉండడం, పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావడం, నేను కూడా మ్యాచ్‌లతో బిజీగా ఉండటంతో మాట్లాడుకోవడానికి ఎక్కువ సమయం దొరకదు. అందుకే రాత్రిసమయంలో కాసేపు సరదాగా మాట్లాడుకుంటాం’ అంటూ రింకూ తన లవ్‌స్టోరీని రివీల్ చేశారు.
జూన్ 8వ తేదీన రింకూసింగ్, ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. లక్నోలోని ప్రముఖ హోటల్లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు రాజకీయ, క్రీడారంగ ప్రముఖలు హాజరయ్యారు. ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో రింకూ, ప్రియ ఉంగరాలు మార్చుకున్నారు. ఇక ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ ఏడాది నవంబర్ 19న వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, నవంబర్‌లో రింకూ క్రికెట్ కమిట్మెంట్లతో పెండ్లిని వాయిదా వేసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరుగనున్నట్టు రింకూ కుటుంబీకులు తెలిపారు.
Also Read..
“రింకూ సింగ్ పెండ్లి వాయిదా!”
“అట్టహాసంగా రింకూ, ప్రియ నిశ్చితార్థం”
“Rinku Singh: 48 బంతుల్లో 108 రన్స్.. రింకూ సింగ్ స్టన్నింగ్ షో.. వీడియో”