లక్నో: బ్యాటర్ రింకూ సింగ్(Rinku Singh) దుమ్మురేపాడు. యూపీ టీ20 టోర్నీలో చెలరేగిపోయాడు. మీరట్ మావరిక్స్ జట్టు తరపున ఆడుతున్న అతను.. సెంచరీతో రెచ్చిపోయాడు. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 48 బంతుల్లోనే 108 రన్స్ చేసి జట్టు విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. ఆసియా కప్ వన్డే జట్టుకు ఎంపికైన రింకూ సింగ్.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చేశాడు. 168 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మీరట్ మావరిక్స్ జట్టు ఓ దశలో 38 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన రింకూ సింగ్ తన పవర్ స్ట్రోక్‌తో ఆకట్టుకున్నాడు. రింకూ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. గత 12 మ్యాచుల్లో అతను 50 ప్లస్ స్కోరు చేయడం ఇది రెండోసారి. వాస్తవానికి ఈ ఏడాది పెద్దగా ఫామ్‌లో లేని రింకూ.. ఆసియా కప్‌కు ముందు ఫామ్‌లోకి రావడం విశేషం.
Chasing a target of 168, Rinku walks in at 38-4. Scores unbeaten 108 off 48. Wins the game in the 19th over. 🤯
The One. The Only. RINKU SINGH! 🦁 💜
— KolkataKnightRiders (@KKRiders) August 21, 2025