లక్నో: టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ పెండ్లి వాయిదాపడినట్టు సమాచారం. గత నెలలో ఈ ఇద్దరి నిశ్చితార్థ వేడుక లక్నోలో ఘనంగా జరుగగా.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ ఏడాది నవంబర్ 19న వీరి వివాహతేదీగా నిశ్చయించారు.
కానీ తాజా సమాచారం ప్రకారం రింకూ పెండ్లి వాయిదాపడ్డట్టు తెలుస్తున్నది. నవంబర్లో రింకూ క్రికెట్ కమిట్మెంట్లతో పెండ్లిని వాయిదా వేసుకున్నట్టు వినికిడి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరుగనున్నట్టు రింకూ కుటుంబీకులు తెలిపారు.