MS Dhoni | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే గుర్తుకొచ్చే గొప్ప ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరు ముందు వరుసలో ఉంటుంది. తన ఆటతో, తన మేనియాతో ఐపీఎల్‌కు పిచ్చి క్రేజ్ తెచ్చాడు ఈ మిస్టర్ కూల్. అంతేనా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)ను ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన వీరుడు అతడు. అయితే.. 18వ సీజన్లో ధోనీ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆడినా అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా? అందుకు బీసీసీఐ అనుమతిస్తుందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఒకింత ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ధోనీ మౌనం వీడారు. సీఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ.. వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడడంపై క్లారిటీ ఇచ్చేశారు.
ఓ ఈవెంట్లో పాల్గొన్న ధోనీ.. తాను మరికొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదించాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. మైదానంలో ప్రొఫెషనల్‌గా గేమ్ ఆడాలనుకుంటే దాన్ని ఎంజాయ్ చేయడం కష్టం అవుతుందన్నారు. కానీ తాను మాత్రం అలా చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘నేను మరికొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదించాలనుకుంటున్నాను. క్రికెట్‌ను వృత్తిపరమైన క్రీడగా ఆడితే దాన్ని ఎంజాయ్ చేయలేము. క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడితేనే జట్టుకు, వ్యక్తిగతంగానూ ప్రయోజనం ఎక్కువ. ఇది చాలా కష్టమైందే. కమిట్మెంట్స్, భావోద్వేగాలు ఉంటాయి. వీటన్నింటినీ పక్కన పెట్టేసి రాబోయే కొన్నేళ్లు నేను ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా. అందుకోసం తొమ్మిది నెలలుగా నన్నునేను ఫిట్‌గా ఉంచుకోవడంపై దృష్టిపెట్టా. ఐపీఎల్లో రెండున్నర నెలలు మాత్రమే ఆడతా.. అందుకోసం పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. వ్యక్తిగతంగానూ జీవితాన్ని గడపాలి’ అంటూ ధోనీ చెప్పుకొచ్చారు.
18వ సీజన్ మెగా వేలానికి ముందు ప్రతి జట్టు ఆరుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవాలని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంచైజీలకు చెప్పింది. దాంతో, పలు జట్లు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నాయి. సీఎస్కే కూడా ధోనీ, జడేజా, గైక్వాడ్‌లను అట్టిపెట్టుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read..
Badminton | బ్యాడ్మింటన్ చాంప్స్ శశాంక్, జ్ఞానదత్
Pune Test | పుణె పాయె.. సొంతగడ్డపై భారత్‌కు దిమ్మతిరిగే షాక్‌లు ఇస్తున్న న్యూజిలాండ్!
Sports Policy | నవంబర్ నెలాఖరులో స్పోర్ట్స్ పాలసీ.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం