Badminton | హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా జరిగిన 36వ జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శశాంక్, జ్ఞానదత్ విజేతలుగా నిలిచారు. శుక్రవారం ముగిసిన టోర్నీలో బాలుర అండర్-15 సింగిల్స్ ఫైనల్లో గోపీచంద్ అకాడమీ ప్లేయర్ శశాంక్ 21-9, 15-21, 21-17తో పుష్కర్సాయి(కర్నాటక)పై గెలిచాడు.
మరోవైపు అండర్-17 సింగిల్స్ తుదిపోరులో జ్ఞానదత్ 21-12, 8-21, 21-17తో జగ్షేర్సింగ్(పంజాబ్)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. విజేతలను గోపీచంద్‌తో పాటు రంగారెడ్డి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, నిఖిల్ అభినందించారు.