Kohli & Dhoni | టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ భారత్‌లో అత్యంత పాపులర్ క్రికెటర్లు.. కుల, మతాలకతీతంగా వీరిద్దరికి సోషల్‌మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారు. ఏయేటికాయేడు వీరిద్దరూ ప్రజాదరణ పొందడంలో మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారు. యాహూ నిర్వహించిన ఇయరెండర్ లిస్ట్‌లో భారత్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఎక్కువ మంది ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన స్పోర్ట్స్ పర్సనాలిటీస్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ. కోహ్లీకి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే 17 కోట్ల మందికి పైగా ఫ్యాన్స్ ఉన్నారు. కోహ్లీ, ధోనీ తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్లేయర్లు క్రిస్టియానో రొనాల్డో, లియానెల్ మెస్సీ కూడా నెటిజన్లు అత్యధికంగా వెతికిన స్పోర్ట్స్ స్టార్లుగా నిలిచారు.
ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్-2020లో జావెలిన్‌త్రోలో చారిత్రక స్థాయిలో స్వర్ణపతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రా.. ఈ జాబితాలో ఐదో స్థానం పొందారు. తర్వాతీ జాబితాలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్ సారధి రోహిత్ శర్మ, బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ, బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధూతోపాటు క్రికెటర్ రిషబ్ పంత్ ఉన్నారు.
టీం ఇండియా టీ-20 జట్టుతోపాటు ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) సారధ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి విరాట్ కోహ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన సారధ్యంలో టీం ఇండియా వలర్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌కు వెళ్లడంతోపాటు స్వదేశంలో ఇంగ్లండ్‌పై టీం ఇండియా చిరస్మరణీయ ఆటతీరు ప్రదర్శించడం మరిచిపోలేని అనుభూతిని మిగిల్చాయి.
ఇక మిస్టర్ కూల్‌గా పేరొందిన టీం ఇండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా మరో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు మార్గదర్శిగా నిలిచాడు. కానీ ధోనీ పూర్వాపరాలు, రోజువారీ కార్యకలాపాలు తెలుసుకోవడానికి ఆయన ఎక్కువగా సోషల్ మీడియాలో అందుబాటులో ఉండరు.
అర్జెంటీనా సాకర్ లెజెండ్ లియానెల్ మెస్సీ తన బాల్యం నుంచి పుట్‌బాల్ ఆడుతున్న బార్సిలోనా క్లబ్‌కు దూరం అవుతున్నట్లు ప్రకటించడంతో వార్తల్లోకి వచ్చారు. బార్సిలోనా క్లబ్లో 21 ఏండ్ల టైం గడిపిన తర్వాత ఇటీవలే పారిస్ సెయింట్ జర్మైన్ టీంలో చేరారు. ఇటీవలే ఏడో బాలోన్ డీ`ఓర్ టైటిల్‌ను వరుసగా గెలుచుకున్న 34 ఏండ్ల లియానెల్ మెస్సీ.. తన ప్రత్యర్థి ప్లేయర్లు రాబర్ట్ లెవాన్దోవ్స్కీ, కరీంబెంజెమా సరసన నిలిచారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు అత్యధికంగా ఫాలో అయ్యే మరో సాకర్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో.. ఇటీవల జరిగిన ప్రీమియర్ లీగ్‌లో అర్సెనల్ టీంపై జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇదే మ్యాచ్‌తో 800 గోల్స్ మైలురాయిని అధిగమించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హైదరాబాద్‌లో బడ్జెట్ ధరలో టేస్టీ దోశ, ఇడ్లీ తినాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం అదే.. పారిస్ కూడా దాని తర్వాతే!
మట్టితో ఇంటిని నిర్మించాడు.. ఆ ఇల్లు స్పెషాలిటీ ఏంటో తెలుసా?
డ్రైవర్లకు పోలీసుల ‘గరమ్ చాయ్’.. ఎందుకంటే?