CWC FINAL 2023 : అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్(CWC FINAL 2023)లో భారత జట్టు దారుణంగా విఫలమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో.. 240 పరుగులకే ఆలౌట్ అయింది. కెఎల్ రాహుల్ (107 బంతుల్లో 66, 1 ఫోర్), విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 54, 4 ఫోర్లు), రోహిత్ శర్మ (31 బంతుల్లో 47, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడమే గాక మిడిల్ ఓవర్స్‌లో పరుగుల కట్టడి చేసి భారత్‌ను పరుగులు చేయకుండా నిలువరించారు.
Innings Break!#TeamIndia post 2⃣4⃣0⃣ on the board!
6⃣6⃣ for KL Rahul
5⃣4⃣ for Virat Kohli
4⃣7⃣ for Captain Rohit SharmaOver to our bowlers now 👌
Scorecard ▶️ https://t.co/uVJ2k8mWSt #CWC23 | #MenInBlue | #INDvAUS | #Final pic.twitter.com/22oteriZnE
— BCCI (@BCCI) November 19, 2023
ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా హెజిల్వుడ్, కమిన్స్ లు తలా రెండు వికెఓట్లు పడగొట్టారు. మ్యాక్స్‌వెల్, జంపాలకు ఒక్కో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 241 పరుగులు చేయాల్సి ఉంది. భారత్.. పది వికెట్లు తీయగలిగితే 12 సంవత్సరాల తర్వాత మరో వన్డే ప్రపంచకప్ గెలిచి మూడోసారి విశ్వవిజేతగా నిలువనుంది. మరి భారత బౌలర్లు ఏం మాయ చేస్తారో తెలియాలంటే మరికొద్దిసేపు వేచి చూడాల్సిందే.