న్యూఢిల్లీ, డిసెంబర్ 24 : భారతీ ఎయిర్టెల్ ప్రమోటర్ సునీల్ మిట్టల్ తాజాగా ఎఫ్ఎంసీజీ రంగంలోకి అడుగుపెట్టారు. ఎఫ్ఎంసీజీ రంగంలో తనదైన ముద్రవేసిన చైనాకు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ హాయర్ గ్రూపులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. మిట్టల్‌కు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్, వార్బర్గ్ పిన్కస్తో కలిసి 49 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నది.
ఒప్పందం విలువ మాత్రం ఇరు సంస్థలు వెల్లడించలేదు. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ కొనుగోళ్లు జరిపినట్టు భారతీ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. హాయర్ ఇండియాలో హాయర్ గ్రూపునకు 49 శాతం వాటా ఉండనుండగా, భారతీ-వార్బర్గ్ పిన్కస్కు 49 శాతం వాటా ఉండనున్నది.