KL Rahul : వరల్డ్ కప్‌ఫైనల్లో భారత మిడిలార్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) అరుదైన ఫీట్ సాధించాడు. ప్రపంచ కప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ బాదిన రాహుల్(66 : 107 బంతుల్లోఒక బౌండరీ)… ఈ ఘనత సొంతం చేసుకున్న ఐదో భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. పైగా ఈసారి మెగా టోర్నీలో అతడికి ఇది మూడో హాఫ్ సెంచరీ.
అతడి కంటేముందు వీరేంద్ర సెహ్వాగ్(2003 ఫైనల్లో ఆస్ట్రేలియాపై), గౌతం గంభీర్(2011 ఫైనల్లో శ్రీలంకపై), మహేంద్ర సింగ్ ధోని (2011 ఫైనల్లో శ్రీలంకపై), విరాట్ కోహ్లీ(2023 ఫైనల్లో ఆసీస్‌పై) ఈ రికార్డు తమ పేరిట లిఖించుకున్నారు.
అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో అయ్యర్(4) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రాహుల్ నిదానంగా ఆడాడు. కోహ్లీతో కలిసి నాలుగో వికెట్‌కు విలువైన 46 పరుగులు జోడించాడు. అయితే.. వరుస ఓవర్లలో కోహ్లీ, రాహుల్ పెవిలియన్ చేరడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది.